కుమారస్వామికి అస్వస్థత.. టిప్పు జయంతి ఉత్సవాలకు దూరం

Fri, Nov 09, 2018, 08:31 PM
  • మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు
  • టిప్పు జయంతి ఉత్సవాలను వ్యతిరేకిస్తున్న బీజేపీ
  • ఆదివారం ఉదయం వరకు మూడు జిల్లాల్లో 144 సెక్షన్
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో, రేపు జరగనున్న టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలకు ఆయన దూరం కానున్నారు.

మరోవైపు ఈ ఉత్సవాలను బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. టిప్పు జయంతి ఉత్సవాలను ఏ ఒక్కరూ హర్షించడం లేదని మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప అన్నారు. ముస్లింలను సంతృప్తి పరిచేందుకే ఈ ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆయన మండిపడ్డారు. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని కొందరు నేతలు కూడా ఈ ఉత్సవాలను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఉత్సవాలను నిర్వహించకూడదని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ఈ నేపథ్యంలో కొడగు, హుబ్లీ, ధార్వాడ్ జిల్లాల్లో ఆదివారం ఉదయం వరకు 144 సెక్షన్ విధించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad