lagadapati: పోలీసు అధికారులపై లగడపాటి వ్యాఖ్యలు సరికాదు: డీసీపీ శ్రీనివాస్

  • ఉమెన్ సొసైటీ భూముల ఆక్రమణ కేసులో జీపీ రెడ్డి నిందితుడు 
  • ముందస్తు బెయిల్ ను కూడా హైకోర్టు రద్దు చేసింది
  • పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు

హైదరాబాదులోని వ్యాపారవేత్త జీపీ రెడ్డి నివాసంలో తనిఖీలు చేపట్టేందుకు వెళ్లిన పోలీసులపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ అన్నారు. బంజారాహిల్స్ ఉమెన్ సొసైటీ భూముల ఆక్రమణ కేసులో జీపీ రెడ్డి నిందితుడిగా ఉన్నారని... కేసు విచారణలో భాగంగానే పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారని చెప్పారు. జీపీ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ ను కూడా హైకోర్టు రద్దు చేసిందని తెలిపారు. గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదని చెప్పారు.

నిన్న రాత్రి 10 గంటలు దాటిన తర్వాత జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65లో ఉన్న జీపీ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లిన సంగతి తెలిసిందే. సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న లగడపాటి... వారెంట్ లేకుండానే ఎలా వచ్చారంటూ పోలీసులను నిలదీసిన సంగతి తెలిసిందే.

More Telugu News