vijay devarakonda: 'టాక్సీవాలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు

  • 'టాక్సీవాలా'గా విజయ్ దేవరకొండ 
  • ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్
  • ఈ నెల 17వ తేదీన సినిమా విడుదల

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో 'టాక్సీవాలా' సినిమా నిర్మితమైంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందించారు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ లోగా .. అంటే, ఈ నెల 11వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నారు.

ఆ రోజున సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక మొదలు కానుంది. ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వస్తున్నాడు. యూవీక్రియేషన్స్ .. గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కథానాయికలుగా ప్రియాంక జవల్కర్ .. మాళవిక నాయర్ కనిపించనున్నారు. ఈ సినిమాతో మరో సక్సెస్ విజయ్ దేవరకొండకి దొరికినట్టేనని అభిమానులు చెప్పుకుంటున్నారు. విజయ్ దేవరకొండ కూడా అదే నమ్మకంతో వున్నాడు. 

More Telugu News