CPI: మమ్మల్ని తక్కువగా అంచనా వేస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం కల్లే: సీపీఐ

  • తొమ్మిది స్థానాలకు ఏకంగా అభ్యర్థులనే ప్రకటించిన పార్టీ
  • మహాకూటమిలో భాగమైన సీపీఐ కనీసం ఐదు సీట్లు డిమాండ్‌
  • మూడు సీట్లతో సరిపెట్టుకోవాలంటున్న కాంగ్రెస్‌

మహాకూటమి సీట్ల సర్దుబాటు అంశంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న సీపీఐ స్వరం పెంచింది. కాంగ్రెస్‌ తీరును తప్పుపడుతూ గళం విప్పుతోంది. తమను తక్కువగా అంచనా వేస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం కల్లేనని స్పష్టం చేసింది. సీట్ల సర్దుబాటు తర్వాత సీపీఐ మరింత అసంతృప్తితో రగిలిపోతోంది. తొమ్మిది స్థానాలు డిమాండ్‌ చేసిన సీపీఐ ఆ తర్వాత కాస్త దిగివచ్చి కనీసం ఐదు సీట్లయినా కేటాయించాలని కోరింది.

చర్చోపచర్చల అనంతరం కాంగ్రెస్‌ మూడు సీట్లతో సరిపెట్టింది. ఇది సీపీఐలో ఆగ్రహానికి కారణమయింది. ఏకంగా తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఐదు సీట్లకు తక్కువకు అంగీకరించేది లేదని చెబుతోంది. ఈరోజు సీపీఐ నేత కూనమనేని సాంబశివరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో సీపీఐ బలంగా ఉందని, గతంలో మావల్లే కాంగ్రెస్‌ నాలుగు సీట్లు గెలిచిందని గుర్తు చేశారు. అందువల్ల కొత్తగూడెం అసెంబ్లీ సీటు సీపీఐకి కేటాయించాల్సిందేనని స్పష్టం చేశారు.

More Telugu News