charan: టీజర్ తోనే దుమ్మురేపేస్తోన్న చరణ్

  • చరణ్ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ 
  • రామ్ పాత్రలో కనిపించనున్న చరణ్ 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు  

చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' సినిమా రూపొందుతోంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో విలన్ గా వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు.

బోయపాటి మార్క్ తోనే ఈ టీజర్ బయటికి వచ్చింది. లవ్ కి సంబంధించిన అంశాలకి గానీ .. ఫ్యామిలీ డ్రామాను గాని టచ్ చేయకుండా, కేవలం యాక్షన్ .. ఎమోషన్ పైనే దృష్టి పెట్టారు. బోయపాటి మూవీ ప్రధాన లక్షణమైన భారీతనం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాలో రామ్ పాత్రలో చరణ్ కనిపిస్తుండగా, ఆయన ఇంటిపేరును 'కొణిదెల'గా చెప్పుకోవడం మెగా అభిమానులను ఖుషీ చేసే విషయం. సంక్రాంతికి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

More Telugu News