stalin: ఇది దేశానికి ఒక వ్యక్తి తీసుకొచ్చిన విపత్తు: స్టాలిన్

  • పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది
  • బ్యాంకుల ముందు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు
  • లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు

ప్రధాని నరేంద్ర మోదీపై డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయంపై ఆయన మండిపడ్డారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమయిందని ఆయన అన్నారు. ప్రజలు పడిన బాధలు అన్నీఇన్నీ కావని చెప్పారు. దేశానికి ఒక వ్యక్తి తీసుకొచ్చిన విపత్తే నోట్ల రద్దు అని ఆయన ట్వీట్ చేశారు.

ప్రజల సొమ్మును ఇల్లీగల్ గా ప్రకటించడంతో... దేశ ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చారని అన్నారు. బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు రోజుల తరబడి ప్రజలు క్యూలైన్లలో నిలబడ్డారని చెప్పారు. బ్యాంకుల ముందు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారని, చిన్న పరిశ్రమలు ఎన్నో మూత పడ్డాయని మండిపడ్డారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని చెప్పారు. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News