vijay devarakonda: 'టాక్సీవాలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్

  • 'టాక్సీవాలా'గా విజయ్ దేవరకొండ 
  • ఈ నెల 11న ప్రీ రిలీజ్ ఈవెంట్
  • 16వ తేదీన సినిమా విడుదల  

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 'టాక్సీవాలా' రూపొందింది. 'గీతగోవిందం' కంటే ముందుగానే ఈ సినిమాను విడుదల చేయవలసి వుంది. కానీ కొన్ని కారణాల వలన విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. ఇటీవలే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నెల 16వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.సైంటిఫిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 11వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. గీతా ఆర్ట్స్ 2 .. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ రానున్నాడు. అల్లు అర్జున్ రాకతో అందరి దృష్టి ఈ సినిమా వైపుకు మళ్లుతుందని భావిస్తున్నారు. మాళవిక నాయర్ .. ప్రియాంకా జువాల్కర్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, కల్యాణి ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది.  

More Telugu News