vijay: రెండే రోజులు .. 100 కోట్లకి పైగా వసూళ్లు .. 'సర్కార్' సంచలనం

  • తొలి రోజున 56.90 కోట్ల గ్రాస్
  • రెండు రోజుల్లో 110 కోట్ల గ్రాస్ 
  • 200 కోట్ల గ్రాస్ దిశగా పరుగులు  

విజయ్ కథానాయకుడిగా మురుగదాస్ తెరకెక్కించిన 'సర్కార్' మూవీ, దీపావళి కానుకగా తెలుగు .. తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు భాషల్లోను ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, వసూళ్లపరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది.

తొలి రోజునే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 56.90 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక రెండవ రోజు కూడా ఈ సినిమా అదే జోరును కొనసాగించింది. రెండు రోజులను కలుపుకుని ఈ సినిమా 110 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

రజనీకాంత్ 'కాలా' సినిమా వసూళ్లను కూడా 'సర్కార్' అధిగమించింది. 200 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా చేరిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే టాక్ ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది. మొత్తానికి మురుగదాస్ .. విజయ్ ఒకదానికి మించి ఒకటి హిట్ కొట్టేశారని అంతా చెప్పుకుంటున్నారు.  

More Telugu News