surya: దూకుడు మీదే వున్న సూర్య!

  • ముగింపు దశలో 'ఎన్జీకే'
  • చెన్నైలో చివరి షెడ్యూల్ 
  • డిసెంబర్లో గానీ జనవరిలో గాని రిలీజ్  

జయాపజయాలను గురించి పెద్దగా పట్టించుకోకుండా సూర్య చకా చకా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆయన సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'ఎన్జీకే' చేస్తున్నాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. చెన్నైలో ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగును ప్లాన్ చేశారు. 15 రోజుల పాటలు జరగనున్న ఈ షెడ్యూల్ తో షూటింగు పార్టు పూర్తికానుంది.

ప్రధానమైన పాత్రల కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాను దీపావళికి విడుదలయ్యేలా చూడాలని సూర్య భావించాడు. కానీ 'సర్కార్' రంగంలోకి దిగడం వలన .. అది కూడా పొలిటికల్ డ్రామా నేపథ్యంతో కూడిన కథ కావడం వలన వెనక్కి తగ్గారట. రకుల్ .. సాయిపల్లవి కథానాయికలుగా నటించిన ఈ సినిమాను, డిసెంబర్లో గానీ .. జనవరిలో గాని విడుదల చేయనున్నారు. ఈ సినిమా పూర్తికాకముందే మరో రెండు ప్రాజెక్టులను సూర్య లైన్లో పెట్టడం విశేషం.     

More Telugu News