Chandrababu: ఇదిగో 'కియా'... వీడియో చూపించిన చంద్రబాబు!

  • రెండేళ్ల క్రితం పెట్టుబడులకు సిద్ధమైన కియా
  • అనంతపురం జిల్లాలో పూర్తయిన ప్లాంటు నిర్మాణం
  • ప్లాంటు వీడియోను పోస్టు చేసిన చంద్రబాబు

రెండేళ్ల క్రితం నవ్యాంధ్రలో పరిశ్రమను స్థాపించి, కార్లను తయారు చేసేందుకు వచ్చిన 'కియా' ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధమైంది. అనంతపురం జిల్లాలో ఈ ప్లాంటును నెలకొల్పగా, కియా ప్లాంటు నిర్మాణం పూర్తయిందని ఏపీ సీఎం చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. "ఇన్నోవేటివ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్‌ లో తమ ఉత్పత్తులను ప్రారంభించడానికి సిద్ధమైన కియా మోటార్స్ కంపెనీ.." అని క్యాప్షన్ పెట్టారు. చంద్రబాబు పోస్టు చేసిన వీడియోను మీరూ చూడండి.




More Telugu News