Vizianagaram: దీపావళి రోజున విషాదం.. టపాసులు పేల్చుతుండగా నిప్పంటుకుని పలు ఇళ్లు దగ్ధం

  • విజయనగరం జిల్లాలో ఘటన
  • నిప్పురవ్వలు ఎగసిపడి కాలి బూడిదైన ఇళ్లు
  • పండుగ రోజున విషాదం

దీపావళి టపాకాయలు కాల్చుతుండగా నిప్పు రవ్వలు ఎగసిపడి ఇళ్లు దగ్ధమైన సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని జొన్నవలసలో బుధవారం రాత్రి టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటుండగా నిప్పు రవ్వలు పూరిళ్లపై పడ్డాయి. ఆ వెంటనే మంటలు ఎగసిపడి విస్తరించాయి. దీంతో నాలుగు తాటాకు ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు మరింత విస్తరించకుండా నియంత్రించారు. లేదంటే మరిన్ని ఇళ్లు కాలి బూడిదయ్యేవి. ఇళ్లు కోల్పోయిన బాధితుల రోదనలతో ఆ ప్రాంతం విషాదంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిలువ నీడ లేకుండా పోయిన తమను ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News