Hyderabad: పాపం... నాలుగో కుక్కపిల్లా చనిపోయింది... సీరియస్ గా తీసుకున్న పోలీసులు!

  • హైదరాబాద్ లో కుక్కపిల్లల సజీవ దహనం
  • చికిత్స పొందుతున్న నాలుగో కూన మృతి
  • సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్న పోలీసులు

భూమిపై పడి నాలుగు రోజులు కూడా గడవకుండానే అభం శుభం తెలియని నాలుగు పసి కుక్కపిల్లలు దారుణంగా హింసించబడి చనిపోవడంపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ అయ్యారు. విషయం తెలిసిన వారంతా అయ్యో పాపం అనిపించేలా నాలుగు కుక్కపిల్లలను సజీవదహనం చేసిన ఘటన జంతు ప్రేమికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించగా, నేరేడ్ మెట్ పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. మౌలాలీ ప్రాంతంలో నాలుగు కుక్క పిల్లలకు దుండగులు నిప్పు పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనలో మూడు కూనలు అక్కడికక్కడే మరణించగా, నాలుగో కుక్కపిల్లను 'పీపుల్ ఫర్ యానిమల్' ప్రతినిధులు రాజేంద్రనగర్ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న కుక్కపిల్ల మృతి చెందింది. ఇంత దారుణంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

More Telugu News