Tamilnadu: 'దీపావళి వెలుగులు అంతంతే' అంటూ ముందే చెప్పిన తమిళ సిద్ధాంతి... వైరల్ అవుతున్న పాత పంచాంగం!

  • 'ఐపసి' నెలలో శబ్దాలుండవు
  • ముందే జోస్యం చెప్పిన పంచాంగం
  • ఏటా వినిపించే శబ్దాల కనుమరుగు

దీపావళి అంటేనే టపాసుల పండగ. ఢాం... ఢాం అనే శబ్దాలు ఉదయం నుంచే వినిపిస్తుంటే, సందడిగా పిల్లలతో కలసి పెద్దలు జరుపుకునే పర్వదినం. కానీ, ఈ సంవత్సరం నిశ్శబ్ద దీపావళి జరుగుతోంది. పేలుళ్లు లేని దీపావళి వస్తుందని, గతంలోనే ఓ తమిళ సిద్ధాంతి చెప్పిన జోస్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు అయితేనేం, ప్రజల్లో పర్యావరణంపై వచ్చిన అవగాహన అయితేనేం, నేడు దేశవ్యాప్తంగా ప్రతియేటా వినిపించే శబ్దాలు అంతే స్థాయిలో వినిపించడం లేదు.

ఇదిలావుండగా, తమిళనాడులో గతంలో విడుదలైన 'శుద్ధ సర్వముహూర్త పంచాంగం'లో సిద్ధాంతి 'ఐపసి' నెలలో (తమిళ కార్తీక మాసం) పేలుళ్లు ఉండవని పేర్కొన్నారు. ఇదిప్పుడు వైరల్ అవుతోంది. దీనిలోనే చెన్నైని కుదిపేసిన వరదల గురించిన జోస్యం కూడా ముందుగానే పేర్కొని ఉండటం గమనార్హం. 

More Telugu News