Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఎన్టీఆర్ బయోపిక్ లో అనుష్క  
  • దర్శకత్వం వహించనున్న విశాల్ 
  • తమిళ రీమేక్ లో సందీప్ కిషన్ 
  • 'టాక్సీవాలా'లో నిన్నటితరం నాయిక  

*  క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ లో తారాగణం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఇందులో నాటి అందాలనటి బి.సరోజాదేవి పాత్రను పోషించడానికి ప్రముఖ నటి అనుష్క ఓకే చెప్పినట్టు సమాచారం.
*  తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన తమిళ హీరో విశాల్ త్వరలో దర్శకుడిగా మారనున్నాడు. జంతువుల చుట్టూ తిరిగే కథతో ఓ చిత్రాన్ని రూపొందించడానికి ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*  చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో సందీప్ కిషన్ తాజాగా ఓ తమిళ హిట్ మూవీ తెలుగు రీమేక్ లో నటించనున్నాడు. నూతన దర్శకుడు మోహన్ గోవింద్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ నిర్మాత సీవీ కుమార్ నిర్మిస్తారు.
*  నిన్నటి కథానాయిక కల్యాణి తాజాగా 'టాక్సీవాలా' సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ నెల 17న విడుదల కానున్న ఈ చిత్రంలో ఆమె విజయ్ దేవరకొండకు వదినగా నటించిందట. 

More Telugu News