gunasekhar: రానా, గుణశేఖర్ ల 'హిరణ్యకశిప' వుందట!

  • గుణశేఖర్ దర్శకుడిగా 'హిరణ్యకశిప'
  • నిర్మాతగా రానా 
  • భారతీయ భాషలన్నిటిలో రిలీజ్  

గుణశేఖర్ తన దర్శకత్వంలో 'హిరణ్య కశిప' అనే సినిమా రూపొందనుందనీ, ఈ సినిమాలో టైటిల్ రోల్ ను రానా పోషించనున్నాడని ఆ మధ్య చెప్పారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కానుందని అన్నారు. ఆ తరువాత ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అప్డేట్స్ లేవు. దాంతో ఈ సినిమా లేనట్టేననే ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ ప్రాజెక్టు గురించే నిర్మాత సురేశ్ బాబు మాట్లాడారు. "ఈ సినిమాకి సంబంధించిన పనుల్లోనే వున్నాము. దర్శకుడు గుణశేఖర్ వైపు నుంచి కూడా పనులు చురుగ్గా జరుగుతున్నాయి. గ్రాఫిక్స్ పనులు 'లండన్' లో జరగనున్నాయి. ఈ సినిమాకి రానాయే నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాను అన్ని భారతీయ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచన వుంది. భారీ ప్రాజెక్టు కనుక ఆలస్యం అవుతోంది" అని ఆయన చెప్పుకొచ్చారు.    

More Telugu News