trivikram: త్రివిక్రమ్ .. బన్నీ సినిమా ప్రకటన రేపే?

  • త్రివిక్రమ్ కోసమే అల్లు అర్జున్ వెయిటింగ్ 
  • రంగంలోకి దిగిన త్రివిక్రమ్ 
  • త్వరలోనే సెట్స్ పైకి  

'నా పేరు సూర్య' ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో బన్నీ ఆలోచనలో పడ్డాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో, త్రివిక్రమ్ తోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. కొంతమంది దర్శకులు కథలు వినిపించినా, త్రివిక్రమ్ తో చేసిన తరువాతనే వాటిని గురించి ఆలోచించాలనుకున్నాడు. త్రివిక్రమ్ కోసమే తాను వెయిట్ చేస్తోన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాడు.

దాంతో 'అరవింద' పూర్తి కాగానే బన్నీ కోసం త్రివిక్రమ్ రంగంలోకి దిగిపోయాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుందనే వార్త హల్ చల్ చేస్తోంది. రేపు త్రివిక్రమ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ - బన్నీ సినిమా గురించిన ప్రకటన రేపు అధికారికంగా రావచ్చుననే మాట బలంగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమా హారిక అండ్ హాసిని బ్యానర్ పై రూపొందుతుందా? లేదంటే గీతా ఆర్ట్స్ పై నిర్మితమవుతుందా? అనేదే ఆసక్తికరంగా మారింది.    

More Telugu News