simbu: పవన్ పాత్రలో శింబు .. దీపావళి కానుకగా ఫస్టులుక్ రిలీజ్

  • సమంత పాత్రలో కేథరిన్ 
  • ప్రణీత పాత్రలో మేఘా ఆకాశ్ 
  • సంక్రాంతికి విడుదల

పవన్ కల్యాణ్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో 'అత్తారింటికి దారేది' ముందువరుసలో కనిపిస్తుంది. పవన్ అభిమానులు ఈ సినిమాను ఎప్పటికీ మరిచిపోలేరు. అంతగా ఈ సినిమా వాళ్ల మనసులకు హత్తుకుపోయింది. వసూళ్ల  పరంగా కొత్త రికార్డులను సృష్టించిన ఈ సినిమాలో, పవన్ సరసన సమంత .. ప్రణీత కథానాయికలుగా నటించారు.

తెలుగులో ఈ సినిమా సాధించిన విజయం కారణంగా తమిళంలో శింబు హీరోగా రీమేక్ చేస్తున్నారు. సుందర్.సి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. సమంత పాత్రలో కేథరిన్ నటిస్తుండగా .. ప్రణీత పాత్రలో మేఘా ఆకాశ్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాకి 'వంతరాజ వతన్ వరువేన్' అనే టైటిల్ ను ఖరారు చేసి, దీపావళి కానుకగా శింబు ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. 

More Telugu News