raviteja: అదరగొట్టేస్తోన్న 'అమర్ అక్బర్ ఆంటోని' లిరికల్ వీడియో సాంగ్

  • ఈ నెల 10న ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ఈ నెల 16వ తేదీన సినిమా రిలీజ్ 
  • అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి

శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా నిర్మితమైంది. ఇలియానా కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. దీపావళి కానుకగా అందించిన ఈ లిరికల్ వీడియో సాంగ్ అదరగొట్టేస్తోంది. "హే హలో హలో డాన్ బాస్కో .. ఛల్ ఛలో ఛలో పంజూస్కో .. పడిపడి ఎంతైనా ట్రై చేస్కో .. నే దొరకను కాస్కో" అంటూ ఈ సాంగ్ కొనసాగుతోంది.

తమన్ అందించిన ఈ బాణీ యూత్ ని హుషారెత్తించేలా వుంది. 'విశ్వ' రాసిన ఈ పాటను .. శ్రీకృష్ణ .. జస్ప్రీత్ .. రమ్య బెహ్రా తదితరులు ఆలపించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 10వ తేదీన గ్రాండ్ గా జరపనున్నారు. ఈ నెల 16వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. శ్రీను వైట్ల .. రవితేజ కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాలు భారీ విజయాలను సాధించాయి. అందువలన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది.

More Telugu News