rbi: ఆర్బీఐ రాహుల్ ద్రావిడ్ లా పని చేయాలి: మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు

  • ఆర్బీఐ నిర్వహణలో ప్రభుత్వ జోక్యం ఉండరాదు
  • దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటమే ఆర్బీఐ లక్ష్యం
  • ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ఆర్బీఐపై ఉంది

భారత ఆర్థిక వ్యవస్థను కాపాడటమే ఆర్బీఐ లక్ష్యమని ఆ సంస్థ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. సంస్థను పటిష్టంగా నిర్వహించడమే లక్ష్యంగా పని చేయాలని చెప్పారు. ఆర్బీఐ నిర్వహణలో ప్రభుత్వ జోక్యం ఉండరాదని... ఇతర ప్రయోజనాల కోసం ఆర్బీఐని వాడుకోవడం మంచిది కాదని అన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు ఆర్బీఐ సీట్ బెల్ట్ లాంటిదని చెప్పారు. ఆర్బీఐ ఎప్పుడూ రాహుల్ ద్రావిడ్ లా ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళ్లాలని... సిద్ధూలా దూకుడుగా ఆడే ప్రయత్నం చేయకూడదని అన్నారు. ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

తన వద్ద ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించడమే కాకుండా... ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ఆర్బీఐపై ఉందని రాజన్ అన్నారు. ఆర్బీఐ బోర్డులో వివిధ రంగాల నుంచి వచ్చిన మేధావులు ఉంటారని... ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు.

More Telugu News