Mehul Choksi: బ్యాంకులను మోసం చేసి విదేశాలకు చెక్కేసిన మేహుల్ చౌక్సీ కుడిభుజం దీపక్ కులకర్ణి అరెస్ట్

  • బ్యాంకాక్ నుంచి వస్తున్నట్టు పసిగట్టిన ఈడీ
  • కోల్ కతా ఎయిర్ పోర్టులో అరెస్ట్
  • చౌక్సీ సంస్థకు డైరెక్టర్ గా ఉన్న దీపక్

పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా, పలు బ్యాంకులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లిపోయిన మేహుల్ చౌక్సీ కుడిభుజం దీపక్ కులకర్ణిని ఎన్ ఫౌర్స్ మెంట్ డైరెక్టరేట్ విభాగం అరెస్ట్ చేసింది. ఆయన హాంకాంగ్ నుంచి కోల్ కతా వస్తున్నాడని విశ్వసనీయంగా తెలుసుకున్న ఈడీ, ఎయిర్ పోర్టులోనే ఆయన్ను అరెస్ట్ చేసింది.

మేహుల్ చౌక్సీ హాంకాంగ్ లో నడుపుతున్న ఓ డబ్బా కంపెనీకి కులకర్ణి డైరెక్టర్ గా ఉన్నాడు. ఇతని ఆచూకీ కోసం గతంలో ఈడీ, సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఇండియాకు వస్తున్నట్టు తెలుసుకుని అరెస్ట్ చేశామని ఈడీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

More Telugu News