cow: మళ్లీ పాతరోజులు.. వస్తుమార్పిడి పద్ధతిలో గోవును కొనుగోలు చేసిన గుంటూరు వాసి

  • గోవు ధర రూ.1.51 లక్షలు
  • 90 క్వింటాళ్ల మొక్కజొన్నలు ఇచ్చి మార్పిడి చేసుకున్న వైనం
  • ధన త్రయోదశి రోజు లక్ష్మీదేవి తన ఇంటికి వచ్చిందన్న మురళీకృష్ణ

నాగరికత పెరిగిన తర్వాత వస్తు మార్పిడి కాస్తా నగదు రూపంలోకి మారింది. ఇప్పుడు ప్రపంచంలో ఏమూల చూసినా జరుగుతున్నది ఇదే. ప్రతి చోట శాసించేది డబ్బే. రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత దేశంలోని కొన్ని చోట్ల వస్తు మార్పిడి పద్ధతిలో తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత మళ్లీ ఏటీఎంలలోకి నగదు వచ్చి చేరడంతో మళ్లీ నగదు మార్పడి మొదలైంది. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే.. తాజాగా గుంటూరు జిల్లాలో మళ్లీ ఇటువంటి ఘటనే జరిగింది.

జిల్లాలోని కొల్లూరు మండల పరిధిలోని పోతర్లంకకు చెందిన ఈడ్పుగంటి కుటుంబరావుకు చెందిన గోవును వేమూరుకు చెందిన వేమూరు మురళీకృష్ణ వస్తు మార్పిడి రూపంలో 90 క్వింటాళ్ల మొక్క జొన్నలు ఇచ్చి కొనుగోలు చేశాడు. గోవు ధర రూ.1,51,200 కావడంతో ఆ మేరకు విలువైన మొక్కజొన్నలు ఇచ్చి ఆవును సొంతం చేసుకున్నాడు. ధన త్రయోదశి రోజున గోవు ఇంటికి రావడంతో సాక్షాత్తూ లక్ష్మీదేవే తన ఇంటికి వచ్చినట్టు భావిస్తున్నానని మురళీకృష్ణ ఆనందం వ్యక్తం చేశాడు.

More Telugu News