Bangalore: ‘బ్రేక్ త్రూ’పోటీలో బెంగళూరు విద్యార్థికి రూ. 2.9 కోట్ల బహుమతి

  • లైఫ్ సైన్సెస్‌పై మూడు నిమిషాల వీడియో
  • విజేతగా ఎంపికైన బెంగళూరు విద్యార్థి సమయ్
  • అభినందించిన శాస్త్రవేత్తలు

బ్రేక్ త్రూ జూనియర్ చాలెంజ్ పోటీల్లో బెంగళూరుకు చెందిన సమయ్ గోడిక అనే విద్యార్థి రూ.2.9 కోట్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. శాన్‌ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన 4వ అంతర్జాతీయ స్థాయి బ్రేక్ త్రూ పోటీలకు సంబంధించిన ప్రైజ్ మనీ వివరాలను నిర్వాహకులు ప్రకటించారు.

ఇందులో సమయ్ విజేతగా నిలిచినట్టు తెలిపారు. లైఫ్ సైన్సెస్‌కు సంబంధించిన ఈ పోటీలో భౌతిక, జీవశాస్త్రాల పరికల్పన సిద్ధాంతాలపై మూడు నిమిషాల వీడియోను రూపొందించేందుకు 13 నుంచి 18 ఏళ్ల వయసున్న విద్యార్థులను పోటీలకు ఆహ్వానించారు.

బెంగళూరులోని కోరమంగళలోని నేషనల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి సమయ్ (16) సమర్పించిన వీడియో నిర్వాహకులను ఆకట్టుకుంది. ‘సికార్డియన్ రిథమ్స్’అంశంతో ఈ వీడియోను రూపొందించారు. వీడియోను రూపొందించిన సమయ్‌‌ను విజేతగా ప్రకటించడంతో పాఠశాల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు సమయ్‌ను అభినందించారు.

More Telugu News