Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కల నెరవేరిందంటున్న కాజల్ అగర్వాల్
  • పల్లె వాతావరణంలో విజయ్ దేవరకొండ 
  • అక్షయ్ కుమార్ సినిమాలో నిత్యా మీనన్

*  కమలహాసన్ ప్రధాన పాత్రధారిగా శంకర్ రూపొందిస్తున్న 'భారతీయుడు 2' సినిమాలో కథానాయికగా కాజల్ అగర్వాల్ ఎంపిక ఖరారైంది. ఈ సందర్భంగా కాజల్ చెబుతూ, ఒక ఇన్ స్టిట్యూషన్ వంటి కమల్ తో, శంకర్ వంటి దర్శక దిగ్గజంతో పనిచేసే అవకాశం కలగడంతో తన చిరకాల స్వప్నం సాకారమైందని పేర్కొంది.
*  విజయ్ దేవరకొండ నటిస్తున్న 'డియర్ కామ్రేడ్' చిత్రం షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలోని తొండంగి గ్రామంలో జరుగుతోంది. వారం రోజుల పాటు ఈ షూటింగ్ జరుగుతుంది. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది.
*  నిత్యా మీనన్ తొలిసారిగా ఓ హిందీ సినిమాలో నటిస్తోంది. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న 'మిషన్ మంగళ్' చిత్రంలో ఓ నాయికగా నిత్యా నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో విద్యాబాలన్, తాప్సీ, సోనాక్షి సిన్హా కూడా నటిస్తున్నారు.

More Telugu News