Andhra Pradesh: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. చర్చకు రానున్న ‘కోడి కత్తి’ వ్యవహారం!

  • సచివాలయంలో కేబినెట్ మీట్
  • ‘కోడి కత్తి’ వ్యవహారంపై చర్చ
  • ఢిల్లీ పర్యటన వివరాలను వెల్లడించనున్న సీఎం

నేడు ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం కానుంది. మచిలీపట్నం, ఏలూరు, ఒంగోలులో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ఏర్పాటుపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే, ఇనామ్ యాక్ట్ 2013, ఏపీ అసైన్‌మెంట్ యాక్ట్ 1977 చట్ట సవరణపైనా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. వీటితోపాటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అనంతరం ఈ విషయమై హోంమంత్రి, లేదంటే మరో మంత్రి కాల్వ శ్రీనివాసులులలో ఎవరో ఒకరు మీడియాతో మాట్లాడతారని సమాచారం.

గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటు, ప్రకాశం జిల్లా దొనకొండలో  ఇండస్ట్రియల్‌ మెగా హబ్‌ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అలాగే, ఏపీఐఐసీకి 2400 ఎకరాలు కేటాయించడంపైనా చర్చించనున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా ఇటీవల ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడి పరిణామాలను మంత్రులకు వివరించనున్నట్టు సమాచారం.

More Telugu News