Jana Sena: రాజకీయ నాయకులను వారి వ్యక్తిత్వం ఆధారంగా ఎన్నుకోవాలి: పవన్ కల్యాణ్

  • ప్రజాధనాన్ని ఇష్టమొచ్చినట్టు వాడుకుంటున్నారు
  • విద్య, వైద్యం ఉచితంగా అందించాలన్నదే లక్ష్యం
  • సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లే హక్కు నాకు ఉంది

రాజకీయ నాయకులను కులాల వారీగా కాకుండా, వారి వ్యక్తిత్వం ఆధారంగా ఎన్నుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ సమక్షంలో పలువురు వైద్యులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ప్రజాధనాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వారు తమ సెల్ఫ్ చెక్కులు మాదిరి రాసేసుకుంటున్నారని విమర్శించారు.

విద్య, వైద్యం అందరికీ ఉచితంగా అందించాలన్నదే తమ పార్టీ లక్ష్యమని, ప్రజాస్వామ్యంలో వైద్యులు భాగమైనప్పుడే వారికి ప్రశ్నించే హక్కు వస్తుందని అన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలు నచ్చితే కనుక ప్రజల్లోకి వాటిని తీసుకెళ్లాలని, నచ్చిన వారికే ఓటు వేయండని సూచించారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లే హక్కు తనకు ఉందని, తనను ఎవరూ అడ్డుకోలేరని పవన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ప్రెసిడెంట్ గా కూడా పనిచేయని వ్యక్తి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యారని విమర్శించారు.

More Telugu News