Chandrababu: వక్ఫ్ భూములమ్ముకున్న దొంగ చంద్రబాబు: తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆరోపణ

  • ఐదు వేల ఎకరాల వక్ఫ్ భూములను అమ్ముకున్నారు
  • ఆంధ్రానాయకులు పట్టించుకోలేదు
  • తెలంగాణలో ముస్లింలను ఆర్థికంగా అణగదొక్కారు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఖమ్మంలో టీఆర్ఎస్ నేతృత్వంలో ముస్లిం, మైనార్టీల ఆత్మీయసభ నిర్వహించారు. ఈ సభకు మహమూద్ అలీ, ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ, గతంలో ఐదు వేల ఎకరాల వక్ఫ్ బోర్డు భూములను అమ్ముకున్న దొంగ చంద్రబాబునాయుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ భూములు అన్యాక్రాంతమవుతున్నప్పటికీ ఆంధ్రానాయకులు పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణలో ముస్లింలను ఆర్థికంగా అణగదొక్కింది ఆంధ్రా పార్టీలేనని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముస్లిం వ్యక్తిని రెవెన్యూ శాఖ మంత్రిగా చేయడం వల్లే 45 వేల ఎకరాల వక్ఫ్ భూములను మళ్లీ రికార్డుల్లో పొందుపరచగలిగామని, ముస్లింలకు రెండు వేల కోట్ల బడ్జెట్ పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరతామని ఈ సందర్భంగా మహమూద్ అలీ మరోసారి హామీ ఇచ్చారు.  

More Telugu News