rmp: ఆర్ఎంపీ, పీఎంపీలకు త్వరలో ధ్రువీకరణపత్రాలు అందజేస్తాం: మంత్రి కేటీఆర్

  • గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ, పీఎంపీల సేవలు అవసరం
  • ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది
  • ‘ఆరోగ్య తెలంగాణ’ కోసం పాటుపడుతున్నాం

గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ, పీఎంపీల సేవలు చాలా అవసరమని, వారికి త్వరలో ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్లలో ఆర్ఎంపీలు, పీఎంపీలతో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, ‘ఆరోగ్య తెలంగాణ’ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వేములవాడలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని, సిరిసిల్లలో 300 పడకలతో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నలభై ఆసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని, ప్రతి ఏరియా ఆసుపత్రిలో 10 పడకలతో ఐసీయూలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణలో ప్రాజెక్టుల గురించి ఆయన మాట్లాడుతూ, అసాధారణ వేగంతో ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతోందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటింటికీ మంచినీళ్లు అందిస్తామని, సీఎం కేసీఆర్ పట్టుదల వల్లే ఈరోజున రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు.

More Telugu News