raviteja: రవితేజ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు

  • రవితేజ హీరోగా 'అమర్ అక్బర్ ఆంటోని'
  • ఈ నెల 10వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • 16వ తేదీన సినిమా విడుదల  

ఒకప్పుడు వరుస విజయాలను అందుకుంటూ వచ్చిన శ్రీను వైట్ల, ఆ తరువాత సక్సెస్ అనే మాట విని చాలా కాలమైంది. ఈ క్రమంలో తాజాగా 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేశాడు. రవితేజ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన కథానాయికగా ఇలియానా నటించింది. రవితేజ మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్న ఈ సినిమా, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది.

ఈ నెల 10వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకి పెద్దసంఖ్యలో హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 16వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తమన్ స్వరపరిచిన పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. ఈ సినిమా సక్సెస్ పైనే ఇటు శ్రీను వైట్ల .. అటు రవితేజ ఆశలు పెట్టుకున్నారు. ఇక మళ్లీ తెలుగులో పాగా వేద్దామనుకుంటోన్న ఇలియానాకి కూడా ఈ సినిమా హిట్ ముఖ్యమే.  

More Telugu News