nidhi agarwal: నిధి అగర్వాల్ జోరు కొనసాగడం ఖాయమట!

  • 'సవ్యసాచి'తో పరిచయమైన నిధి అగర్వాల్ 
  • గ్లామర్ పరంగా మంచి మార్కులు 
  • పెరుగుతోన్న అవకాశాలు  

'సవ్యసాచి' సినిమాతో తెలుగు తెరకి నిధి అగర్వాల్ పరిచయమైంది. ఈ సినిమాలో చైతూ జోడిగా ఈ సుందరి ఆడిపాడింది. ఈ సినిమా ఫలితం సంగతి అటుంచితే, గ్లామర్ పరంగా ఈ అమ్మాయి నూటికి నూరు మార్కులు కొట్టేసింది. కుర్రాళ్లంతా కూడా ఈ మధ్యకాలంలో ఇంతటి బ్యూటీని చూడలేదని అంటున్నారు. ఈ చక్కనమ్మకి స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు.

చక్కని కనుముక్కుతీరుతో ఇట్టే ఆకట్టుకుంటోన్న ఈ అమ్మాయిని తమ సినిమాలోకి తీసుకోమంటూ కొంతమంది హీరోల వైపు నుంచి దర్శక నిర్మాతలపై వత్తిడి పెరుగుతోందట. దాంతో దర్శక నిర్మాతలు ఈ అమ్మాయి డేట్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని టాక్. ఇక ఈ అమ్మాయి రెండవ సినిమాగా అఖిల్ 'మిస్టర్ మజ్ను' రానుంది. ఆ సినిమా కనుక హిట్ కొట్టిందంటే టాలీవుడ్లో ఈ సుందరి జోరు పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

More Telugu News