banks: నాలుగు రోజుల పాటు బ్యాంకుల మూత.. జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల సూచన!

  • దీపావళి సందర్బంగా రెండ్రోజులు సెలవులు
  • ఏటీఎంలలో నగదును లోడ్ చేస్తున్న అధికారులు
  • సెలవుపై వెళ్లనున్న మెజారిటీ ఉద్యోగులు

దీపావళి పండుగ, ఆ తర్వాత వరుస సెలవులు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇబ్బందిపడకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకు ఉన్నతాధికారులు కస్టమర్లకు సూచిస్తున్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల 7, 8 తేదీల్లో సెలవులు ప్రకటించింది. 9వ తేది(శుక్రవారం) ఒక్కరోజు బ్యాంకు పనిచేసినా ఆ తర్వాత రెండో శనివారం, ఆదివారం నేపథ్యంలో నవంబర్ 10, 11 తేదీల్లో మరోసారి మూతపడనుంది. మిగతా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ ఇదే బాట పట్టనున్నాయి.

దాదాపు నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్న నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏటీఎం యంత్రాల్లో నగదును లోడ్ చేస్తున్నారు. ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలను వీలైతే వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. శుక్రవారం బ్యాంకు తెరిచినా ఎక్కువమంది ఉద్యోగులు సెలవుపై ఉండే అవకాశముందని వెల్లడించారు. దీని కారణంగా బ్యాంకింగ్ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయన్నారు.

More Telugu News