vijay devarakonda: మహేశ్ కోసం అనుకున్న కథ .. హీరోగా విజయ్ దేవరకొండ?

  • 'రంగస్థలం'తో హిట్ కొట్టిన సుకుమార్ 
  • తదుపరి సినిమాకి సన్నాహాలు 
  • ప్రభాస్ ను కూడా లైన్లో పెట్టేస్తోన్న సుకుమార్

'రంగస్థలం' సినిమాతో చరణ్ కి కెరియర్లోనే పెద్ద హిట్ ఇచ్చిన సుకుమార్, ఆ తరువాత సినిమాకి సంబంధించిన సన్నాహాలు చేసుకుంటున్నాడు. తన తదుపరి సినిమాను మహేశ్ తో చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తెలంగాణ నేపథ్యంలో మహేశ్ కి ఒక కథ కూడా వినిపించాడట. అయితే ఈ కథ తనకి సెట్ కాదని మహేశ్ చెప్పడంతో, ఆయనకు మరో కథను సిద్ధం చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే మహేశ్ కోసం ముందుగా సిద్ధం చేసిన కథను విజయ్ దేవరకొండతో చేస్తే బాగుంటుందనే ఆలోచన సుకుమార్ వచ్చినట్టుగా చెబుతున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే కథ కావడం వలన, విజయ్ దేవరకొండ సరిగ్గా సరిపోతాడని ఆయన భావించాడని అంటున్నారు. ఈ కథతో ఆయన విజయ్ దేవరకొండను సంప్రదించడం కూడా జరిగిపోయిందని చెబుతున్నారు. మహేశ్ బాబు డేట్స్ అంత తేలికగా దొరికేవి కావు కనుక, ముందుగా మహేశ్ తో ఒక సినిమా చేసేసి .. ఆ తరువాత విజయ్ దేవరకొండతో సెట్స్ పైకి వెళతాడని అంటున్నారు. ఈలోగా ప్రభాస్ ను కూడా సుకుమార్ లైన్లో పెట్టనున్నాడట.  

More Telugu News