Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • శంకర్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ 
  • ఒకేసారి రెండు చిత్రాలలో వెంకటేశ్ 
  • వాయిదా పడిన హెబ్బా పటేల్ '24 కిసెస్'
  • తమిళ దర్శకుడితో శర్వానంద్

*  కమలహాసన్ సరసన అందాల కాజల్ అగర్వాల్ తొలిసారిగా నటించనుంది. శంకర్ దర్శకత్వంలో కమల్ ప్రధాన పాత్రలో 'భారతీయుడు 2' రూపొందనుంది. ఇందులో నాయిక పాత్రకు కాజల్ ను ఎంచుకున్నట్టు సమాచారం.
*  సీనియర్ నటుడు వెంకటేశ్ ఒకేసారి రెండు సినిమాల షూటింగులలో పాల్గొంటారు. ప్రస్తుతం 'ఎఫ్ 2' చిత్రాన్ని పూర్తిచేస్తున్న ఆయన ఈ నెలలోనే 'వెంకీ మామ' చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. వచ్చే నెలలో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందే మరో చిత్రం షూటింగులో కూడా ఆయన పాల్గొంటారు.
*  హెబ్బా పటేల్ కథానాయికగా నటించిన '24 కిసెస్' చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ నెల 15న విడుదల కావలసిన ఈ చిత్రాన్ని ఈ నెల 23కి వాయిదా వేశారు. అయోధ్య కుమార్ దీనికి దర్శకత్వం వహించారు.
*  ప్రస్తుతం 'పడిపడి లేచె మనసు' చిత్రంలో నటిస్తున్న శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడితో చేస్తాడు. విశాల్ తో పలు చిత్రాలను రూపొందించిన తిరు దర్శకత్వంలో శర్వానంద్ ఓ చిత్రాన్ని చేయడానికి అంగీకరించాడు.

More Telugu News