AR Rehman: నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలొచ్చేవి: ఏఆర్ రెహ్మాన్

  • తండ్రి మరణం భయాన్ని పోగొట్టింది
  • ఎవరూ పనికిరారు అనుకోకూడదు
  • అసలు పేరు దిలీప్ నచ్చేది కాదు
  • ఇస్లాం మతంలోకి మారడంతో పేరు మారింది

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ జీవితాధారంగా కృష్ణ తిలోక్ రాసిన బయోగ్రఫీ ‘నోట్స్‌ ఆఫ్‌ ఎ డ్రీమ్‌: ది ఆథరైజ్డ్‌ బయోగ్రఫీ ఆఫ్‌ ఏఆర్‌ రెహ్మాన్‌’ని శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రెహ్మాన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జీవితంలో ఎవరూ పనికిరారు అనుకోకూడదని.. తనకు 25 ఏళ్ల వయసు వచ్చే వరకూ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చేవన్నారు.

తన తండ్రి మరణం తనలో భయాన్ని పోగొట్టిందన్నారు. ఆ సమయంలో 35 సినిమాలకు అవకాశమొస్తే రెండు సినిమాలకు మాత్రమే పనిచేశానని రెహ్మాన్ తెలిపారు. తన అసలు పేరు దిలీప్ అని, రోజా సినిమాకు సంగీతం అందించే సమయంలో తన కుటుంబం ఇస్లాం మతంలోకి మారడంతో తన పేరు రెహ్మాన్‌గా మారిందన్నారు. ఎందుకు ఇష్టంలేదో తెలియదు కానీ అసలు దిలీప్ అనే పేరు తనకు నచ్చేది కాదని తెలిపారు. సంగీతమే తనలో మార్పు తెచ్చిందని రెహ్మాన్ వెల్లడించారు.

More Telugu News