china rajappa: మంచీ చెడూ ఆలోచించాకే విపక్షాలను చంద్రబాబు ఏకం చేస్తున్నారు: మంత్రి చినరాజప్ప

  • దేశ భవిష్యత్ కోసమే ‘కాంగ్రెస్’తో చంద్రబాబు కలిసేది
  • బీజేపీకి తగిన బుద్ధి చెప్పేందుకే ఈ పార్టీలు ఏకమయ్యేది
  • టీడీపీని అణగదొక్కేందుకు బీజేపీ యత్నిస్తోంది

కాంగ్రెస్-టీడీపీ కలయికపై విమర్శలు తలెత్తుతున్న నేపథ్యంలో ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప స్పందించారు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అప్పటి కాంగ్రెస్ పార్టీ కంటే ఇప్పటి బీజేపీ ప్రమాదకారిగా మారిందని, మంచీ చెడూ గురించి ఆలోచించాకే విపక్షాలను చంద్రబాబు ఏకం చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు ప్రధాని అయిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్టీఆర్ మద్దతు తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు.

దేశ భవిష్యత్ కోసమే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కలవడం జరిగిందని, బీజేపీకి తగినబుద్ధి చెప్పేందుకే ఈ రెండు పార్టీలు ఏకమవుతున్నాయని అన్నారు. దేశ భవిష్యత్తు కోసం పదహారు జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏకం కానున్నట్టు చెప్పారు. టీడీపీని అణగదొక్కేందుకు బీజేపీ ఆర్నెల్లుగా యత్నిస్తోందని మండిపడ్డారు. ఏపీలో కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు విషయమై ఇంకా నిర్ణయం కాలేదని, అవసరం మేరకు ఆయన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 

More Telugu News