Shankar: శంకర్ కు రాజమౌళి ప్రశ్న... సమాధానంగా రాజమౌళినే చూపించిన శంకర్!

  • రూ. 600 కోట్లతో తెరకెక్కిన '2.ఓ'
  • ఇంత కూల్ గా ఎలా ఉన్నారన్న రాజమౌళి
  • మిమ్మల్ని చూసిన తరువాత ఇంకేంటన్న శంకర్

ఓ సినిమాను రూ. 600 కోట్లతో నిర్మించి, దాని ట్రయిలర్ నే గ్రాండ్ గా ఆవిష్కరించాడు శంకర్. రజనీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ మరో ప్రధానపాత్రలో తెరకెక్కించిన '2.ఓ' ట్రయిలర్ వేడుక వైభవంగా జరుగుతున్న వేళ, 'బాహుబలి'తో భారత చలనచిత్ర రంగాన్ని మరో మెట్టు ఎక్కించిన రాజమౌళి, సరదాగా శంకర్ ను ఓ ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఏ మాత్రం తడుముకోని శంకర్, సమాధానంగా రాజమౌళినే చూపించారు.

"500 కోట్ల‌తో సినిమా చేసి కూడా ఇంత కూల్ గా ఎలా ఉంటున్నారు? అస‌లెలా ప్రెజ‌ర్ ఫీల్ కాకుండా ఉంటున్నారు, కాస్త చెప్పండి స‌ర్" అని రాజమౌళి ప్రశ్నించగా, దానికి శంకర్ స్పందించారు. "నేను రాజ‌మౌళికి పెద్ద ఫ్యాన్. ఇండియ‌న్ సినిమా మిమ్మల్ని చూసి గ‌ర్వ‌ప‌డుతోంది. నా హా‌ర్డ్ వ‌ర్క్ తోనే ఒత్తిడిని జ‌యిస్తా. మిమ్మల్ని చూసిన తరువాత ఇంక ప్రెజర్ ఏంటి సార్?" అని సమాధానం చెప్పారు. రాజమౌళి మాటలు '2.ఓ' ట్రైయిలర్ కు బైట్స్ రూపంలో రాగా, తెరపై రాజమౌళి కనిపించగానే, అభిమానులు కేరింతలు కొట్టారు.

More Telugu News