India: పది వికెట్లు తీసిన సిదక్.. పర్ఫెక్ట్-10 జాబితాలో చేరిక!

  • పర్ఫెక్ట్ 10 సాధించిన సిదక్
  • కల్నల్ సీకే నాయుడు టోర్నీలో ఘనత
  • గతంలోనే సచిన్ రికార్డును బ్రేక్ చేసిన సిదక్

ఒక క్రికెట్ మ్యాచ్ లో 5 వికెట్లు తీస్తేనే గొప్ప, అంతకు మించి ఎన్ని వికెట్లు ఎక్కువ తీసుకుంటే, అంత గ్రేట్. ఇక 10 వికెట్లూ తీస్తే... వేరే చెప్పాలా? పర్ఫెక్ట్ 10 సాధించిన అతికొద్దిమంది జాబితాలో చేరిపోయాడు పుదుచ్చేరి యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సిదక్ సింగ్. కల్నల్ సీకే నాయుడు అండర్ - 23 టోర్నీలో భాగంగా మణిపూర్ తో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్ లో యూపీ జట్టు బౌలర్ గా ఉన్న 19 ఏళ్ల సిదక్, ఈ అసాధారణ గణాంకాలను నమోదు చేశాడు.

కేవలం 17.5 ఓవర్లు వేసి 31 పరుగులు ఇచ్చి 10 వికెట్లనూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో 7 మెయిడెన్ ఓవర్లూ ఉన్నాయి. దీంతో మణిపూర్ జట్టు 71 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే సచిన్ (14) తరువాత అతి చిన్న వయసులో ముంబైకి ఆడిన ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్న సిదక్, ఇప్పుడు మరో రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు. పర్ఫెక్ట్-10 జాబితాలో అనిల్ కుంబ్లే, జిమ్ లేకర్ లు కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే.

More Telugu News