yogibabu: హీరోగా మారిపోయిన మరో కమెడియన్!

  • కమెడియన్ గా యోగిబాబుకి క్రేజ్ 
  • యమధర్మరాజుగా ప్రధాన పాత్ర 
  • ఈ ఏడాది చివర్లో విడుదల    

కమెడియన్ గా క్రేజ్ వచ్చాక హీరోలుగా మారిన వాళ్లు చాలామందే వున్నారు. అలా హీరోలుగా మారిన కమెడియన్లు హాస్యప్రధానమైన కథల్లోనే అలరించారు. ఒక వైపున కమెడియన్ గా కొనసాగుతూనే, మరో వైపున హీరోగానూ కొనసాగుతూ వచ్చారు. అలా తమిళంలో 'సంతానం' కూడా హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో ఖాళీ లేని కమెడియన్ గా పేరు తెచ్చుకున్న మరో తమిళ నటుడు 'యోగిబాబు' కూడా హీరోగా మారిపోయాడు.

'ధర్మప్రభో' అనే ఒక హాస్యభరితమైన సినిమాలో ఆయన యమధర్మరాజుగా కనిపించనున్నాడు. ముత్తు కుమారన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నారు. రీసెంట్ గా వదిలిన ఈ సినిమా ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా తరువాత యోగిబాబు హీరోగా మరికొన్ని సినిమాలు రూపొందే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.    

More Telugu News