Andhra Pradesh: హైదరాబాద్ లో బాణసంచా ఎంతసేపు కాల్చాలంటే.. నోటిఫికేషన్ జారీచేసిన పోలీసులు!

  • ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన సుప్రీంకోర్టు
  • అందుకు అనుగుణంగా పోలీసుల ఆదేశాలు
  • ఉల్లంఘిస్తే పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు

దీపావళి పండుగ సమీపిస్తుంటే బాణసంచాతో అన్నిప్రాంతాలు మార్మోగుతాయి. పిల్లలు రాకెట్లు, చిచ్చుబుడ్లు కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. అయితే శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో బాణసంచా అమ్మకాలకు లైసెన్సులు ఇవ్వరాదనీ, రాత్రి 8 నుంచి 10 గంటల వరకూ మాత్రమే టపాసులు పేల్చాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. తాజాగా కోర్టు ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు సైతం నోటిఫికేషన్లు జారీచేశారు.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఈ నెల 7న దీపావళి పండుగ సందర్భంగా రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే బాణసంచా కాల్చాలని స్పష్టం చేశారు. అంతకుమించి టపాసులు కాల్చేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

More Telugu News