Andhra Pradesh: ‘పోలవరం’లో కుంగిపోయిన రోడ్డు, కూలిన స్తంభాలు!

  • పోలవరం దగ్గర రోడ్డుకు బీటలు
  • ఏజెన్సీకి రాకపోకలు బంద్
  • భారీ వర్షాలే కారణమంటున్న ఇంజనీర్లు

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాంతంలో ఈ రోజు ఉదయం ప్రజలు బెంబేలెత్తిపోయారు. పోలవరం ప్రాజెక్టుకు సమీపంలోని రోడ్లు బీటలు వారడంతో పాటు విద్యుత్ స్తంభాలన్నీ ఈ రోజు నేలకొరిగాయి. అంతేకాకుండా మరికొన్ని చోట్ల రోడ్లు 4 అడుగుల మేర నేలలోకి కుంగిపోయాయి. ఈ నేపథ్యంలో భూకంపం వచ్చిందని స్థానికులు భయపడుతున్నారు.

అయితే ప్రాజెక్టు సందర్భంగా ఈ రోడ్డును పూర్తిగా మట్టితో నిర్మించామని పోలవరం ఇంజనీర్లు తెలిపారు. దీన్ని తరచుగా నీటితో తడుపుతూ ఉంటామన్నారు. అయితే ఇటీవల భారీగా వర్షాలు కురవడంతో పాటు రోడ్డు నిర్మాణంలో పెద్దపెద్ద రాళ్లు వాడిన నేపథ్యంలో  పట్టుతగ్గి రోడ్డుపై పగుళ్లు ఏర్పడ్డాయని వెల్లడించారు.

ఈ విషయంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రోడ్డు చాలాచోట్ల కుంగిపోయిన నేపథ్యంలో ఈ మార్గంలో ఏజెన్సీలకు రాకపోకలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా రాకపోకలను పునరుద్ధరిస్తామని తెలిపారు.

More Telugu News