junior ntr: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ‘మల్టీస్టారర్’కు ముహూర్తం ఫిక్సయింది!

  • రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో మల్టీస్టారర్
  • ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ముహూర్తం
  • ప్రకటించిన డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ 

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో అగ్రహీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మల్టీ స్టారర్ చిత్రం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ ఓ పోస్ట్ ద్వారా విడుదల చేసిన వీడియోలో తెలిపింది.

ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ఈ సినిమా ప్రారంభోత్సవ ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలిపింది. కాగా, డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం వర్కింగ్ టైటిల్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం టైటిల్ ను, విడుదల తేదీని ఈ సినిమా ప్రారంభం రోజునే ప్రకటిస్తారని సమాచారం. ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందించనుండగా, కెమెరామెన్ గా సెంథిల్ వ్యవహరించనున్నారు.

More Telugu News