Undavalli: చంద్రబాబుకు ఏ పార్టీతో అయినా కలిసే వెసులుబాటు ఉంది: ఉండవల్లి

  • ఐటీ దాడుల తర్వాత చంద్రబాబులో మార్పు వచ్చింది
  • చంద్రబాబు మళ్లీ మోదీతో కలిసినా ఆశ్చర్యం లేదు
  • రాష్ట్రంలో అవినీతి పకడ్బందీగా జరుగుతోంది

ఐటీ దాడుల తర్వాతే చంద్రబాబులో మార్పు వచ్చిందని... కాంగ్రెస్ తో కలిసే పరిస్థితి తలెత్తిందని ఉండవల్లి అన్నారు. ఐటీ దాడుల వల్ల ఎవరికీ, ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. దేశంలో ఎవరితోనైనా కలిసే వెసులుబాటు చంద్రబాబుకు ఉందని చెప్పారు. చంద్రబాబు ఎన్నడూ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లలేదని అన్నారు.

ఎన్నికల తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు మళ్లీ మద్దతు ప్రకటించినా ఆశ్చర్యం లేదని చెప్పారు. పోలవరం అక్రమాలపై తాను చెప్పినవన్నీ జరుగుతున్నాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు నాణ్యత లేకుండా, ప్రమాదకరంగా జరుగుతున్నాయని చెప్పారు. పోలవరంలో జెట్ గ్రౌటింగ్ పనులు కొట్టుకుపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవినీతి పకడ్బందీగా జరుగుతోందని దుయ్యబట్టారు. అమరావతిలో తాత్కాలిక భవనాలు తప్ప మరేమీ నిర్మించలేదని విమర్శించారు.

More Telugu News