నాపై ఎన్ని క్రిమినల్ కేసులున్నాయో చెప్పండి: హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్

02-11-2018 Fri 13:24
  • ఎన్నికల అఫిడవిట్ లో కేసుల వివరాలను నమోదు చేయాలి
  • వివరాలు అడిగితే ఆర్టీఐ ఇవ్వడం లేదు
  • 6వ తేదీకి విచారణను వాయిదా వేసిన హైకోర్టు
తనపై ఎన్ని క్రిమినల్ కేసులున్నాయో తెలపాలంటూ హైకోర్టులో టీకాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్ లో కేసుల వివరాలను నమోదు చేయాలని... వివరాలు కావాలని అడిగితే ఆర్టీఐ ఇవ్వడం లేదని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. తెలంగాణ డీజీపీ, ఆర్టీఐ కమిషనర్ లను ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చారు. తనపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు... తదుపరి విచారణను ఈనెల 6వ తేదీకి వాయిదా వేసింది.