Tech-News: అద్భుత ఫీచర్లు.. నాలుగు కెమెరాలతో విడుదలైన 'లెనోవో జడ్5 ప్రో'!

  • చైనాలో విడుదలైన 'లెనోవో జడ్5 ప్రో'
  • రెండు వేరియంట్ లలో లభ్యం
  • త్వరలోనే భారత మార్కెట్లోకి

చైనా మొబైల్ దిగ్గజం లెనోవో తన నూతన స్మార్ట్ ఫోన్ 'జ‌డ్‌5 ప్రో'ను తాజాగా ఆ దేశ మార్కెట్లో విడుదల చేసింది. స్లైడింగ్ డిజైన్, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, నాలుగు కెమెరాలతో ఈ ఫోన్ వినియోగదారులకి అందుబాటులో ఉండనుంది. రెండు వేరియంట్లలో లభ్యం అయ్యే ఈ ఫోన్ ను ఈ నెల 11 నుండి మార్కెట్లో విక్రయించనున్నారు. భారత్ లో విడుదల తేదిపై స్పష్టత లేనప్పటికీ త్వరలోనే మన దేశ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.రూ.21400 ఉండ‌గా, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.24300గా ఉంది.

లెనోవో జ‌డ్ 5 ప్రో ఫీచ‌ర్లు:

  • వెనక భాగంలో రెండు 16/24 మెగాపిక్స‌ల్ కెమెరాలు
  • ముందు భాగంలో 16/8 మెగాపిక్స‌ల్ సేల్ఫీ కెమెరాలు
  • 6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌
  • 6.39" ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే (1080 × 2340 రిజ‌ల్యూష‌న్‌)
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • ఫేస్ అన్‌లాక్‌, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌
  • 3350ఎంఏహెచ్ బ్యాట‌రీ

More Telugu News