rana: 'హౌస్ ఫుల్ 4' సెట్స్ పైకి రానా

  • కొత్తదనానికి రానా ప్రాధాన్యత 
  • ఇతర భాషల నుంచి అవకాశాలు
  • 'హౌస్ ఫుల్ 4'లో ఖాన్ పాత్ర    

కథా కథనాల్లో కొత్తదనం .. పాత్రల్లో వైవిధ్యం ఉండాలేగానీ, ఏ భాషా చిత్రం చేయడానికైనా రానా సిద్ధపడుతుంటాడు. ఆల్రెడీ గతంలో హిందీ సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు 'హౌస్ ఫుల్ 4' సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అక్కడ జరుగుతోన్న మేజర్ షెడ్యూల్లో రానా పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో ఆయన 'ఖాన్' పాత్రలో కనిపించనున్నాడు.

సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఫర్హాద్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. అక్షయ్ కుమార్ .. రితేశ్ దేశ్ ముఖ్ .. బాబీ డియోల్ .. కృతీ సనన్ .. కృతి కర్బందా .. పూజా హెగ్డే ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలో తాను చేస్తోన్న పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందనీ .. తన నటనలో మరో కోణాన్ని ఈ పాత్ర ద్వారా ఆవిష్కరించే అవకాశం కలిగిందని రానా చెబుతున్నాడు. ఇక తెలుగులోను ఆయన విభిన్నమైన కథలను చేస్తున్న సంగతి తెలిసిందే.   

More Telugu News