Srinivasa Rao: జగన్ పై హత్యాయత్నం కేసులో కీలక ఆధారాలు లభ్యం: సిట్

  • కేసు తీవ్రత దృష్ట్యా బయట పెట్టలేము
  • శ్రీనివాసరావుకు నిజ నిర్ధారణ పరీక్షలు జరిపే యోచన
  • మీడియాతో సిట్ డీఎస్పీ అస్మి

గతవారం విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై హత్యాయత్నం చేసిన జే శ్రీనివాసరావును విచారించి కీలక ఆధారాలను సంపాదించామని, అయితే, కేసు తీవ్రత దృష్ట్యా వాటిని ఇప్పటికిప్పుడు బయట పెట్టలేమని సిట్ డీఎస్పీ అస్మి మీడియాకు తెలిపారు. శ్రీనివాసరావును అన్ని కోణాల్లో విచారించామని చెప్పిన ఆయన, కొన్ని ముఖ్యమైన ఆధారాలు దొరికాయని తెలిపారు. దాడికి వాడిన కోడి కత్తిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని, రిపోర్టు అందాల్సివుందని వెల్లడించారు. శ్రీనివాసరావుకు నిజ నిర్ధారణ పరీక్షలు జరిపే ఆలోచనలో ఉన్నామని, అందుకు కోర్టు అనుమతిని కోరనున్నామని తెలిపారు.

రేపటి నుంచి జరిగే జగన్ యాత్రకు ఎప్పటిలానే గట్టి బందోబస్తు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శ్రీనివాసరావు మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తొలుత భావించామని, అయితే, వైద్యుల పరీక్షల తరువాత అతను బాగున్నాడనే నిర్ణయానికి వచ్చామని, నేడు అతన్ని తిరిగి కోర్టు ముందు ప్రవేశపెట్టి, ఆపై కస్టడీని పొడిగింపును కోరనున్నామని అన్నారు.

More Telugu News