Uttar Pradesh: 12 వేల మంది టీచర్ల ఉద్యోగాలు మటాష్... అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!

  • నియామకాల్లో అవకతవకలు 
  • పలు పిటిషన్లపై విచారించిన హైకోర్టు
  • 68,500 పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిపివేత

ఉత్తరప్రదేశ్ లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న 12 వేల మంది నియామకాలు చెల్లవని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మరో 68,500 పోస్టుల భర్తీ ప్రక్రియపై సీబీఐతో దర్యాఫ్తు చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 2016లో అఖిలేష్ యాదవ్ సర్కారు 12,600 పోస్టులు భర్తీ చేయగా, నియామకాల్లో అవకతవకలు జరిగాయని పిటిషన్లు దాఖలు కావడంతో హైకోర్టు విచారణకు స్వీకరించింది.

ఉత్తరప్రదేశ్ ప్రాథమిక విద్యా నిబంధనలు 1981కు విరుద్ధంగా నియామకాలు సాగాయని తేల్చింది. మొత్తం టీచర్లను తొలగిస్తున్నామని, దర్యాఫ్తును మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించిన ధర్మాసనం, ఈ సంవత్సరం యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన నియామకాల ప్రక్రియపై ఆరు నెలల్లో దర్యాఫ్తు పూర్తి చేయాలని పేర్కొంది.

More Telugu News