Congress: దీపావళి తర్వాత కాంగ్రెస్ జాబితా విడుదల.. కాంగ్రెస్‌ 95, మిత్రపక్షాలు 24 స్థానాల్లో పోటీ

  • సోనియా నివాసంలో సమావేశం
  • 8-9 తేదీల్లో అభ్యర్థుల జాబితా విడుదల
  • 57 స్థానాలపై ఏకాభిప్రాయం

తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల వాయిదా పడింది. గురువారమే దీనిని ప్రకటిస్తారన్న వార్తలు వచ్చినా దీపావళి తర్వాత ప్రకటించాలని నిర్ణయించారు. గురువారం సోనియాగాంధీ నివాసంలో ఉదయం 11 గంటల నుంచి 1 వరకు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులైన అశోక్ గెహ్లట్, ఏకే ఆంటోనీ, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభా పక్ష నేత జానారెడ్డి తదితరులు హాజరయ్యారు.

తెలంగాణలోని మొత్తం 119 స్థానాలకు గాను 95 స్థానాల్లో కాంగ్రెస్, 14 స్థానాల్లో టీడీపీ, టీజేఎస్, సీపీఐలు కలిపి పది స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఇక, కాంగ్రెస్ పోటీ చేయనున్న 95 స్థానాల్లో 57 స్థానాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 8, లేదంటే 9న జాబితా విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

More Telugu News