Telugudesam: ఉత్తర-దక్షిణ ధ్రువాలను కలిపిన ఘనత మోదీదే: సీపీఐ నారాయణ

  • కాంగ్రెస్, టీడీపీలు ఉత్తర-దక్షిణ ధ్రువాలు 
  • ఆ రెండు పార్టీల కలయిక శుభపరిణామం
  • ఈ పరిణామాలను స్వాగతిస్తున్నా

కాంగ్రెస్, టీడీపీలు ఉత్తర-దక్షిణ ధ్రువాలని, అలాంటి ధ్రువాలను కలిపిన ఘనత ప్రధాని మోదీదే అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. తిరుపతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్-టీడీపీ కలయిక శుభపరిణామమని, ఈ పరిణామాలను స్వాగతిస్తున్నానని చెప్పారు.

ఈ సందర్భంగా మోదీపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో అవినీతి తారస్థాయికి చేరిందని, సీబీఐని బీజేపీ తన ఇష్టం వచ్చినట్టు వాడుకుందని దుయ్యబట్టారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లోనే ఐటీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాఫెల్ విమానాల తయారీని అనుభవం లేని అనిల్ అంబానీ సంస్థకు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. సీబీఐ వివాదాలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని డిమాండ్ చేశారు. 

More Telugu News