simha: హీరోగా కీరవాణి తనయుడు 'సింహ'!

  • సంగీత దర్శకుడు కీరవాణికి  ఇద్దరు తనయులు
  • సింగర్ గా పెద్దబ్బాయి కాలభైరవ 
  • హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న చిన్నబ్బాయి   

చిత్రపరిశ్రమలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడమనేది చాలాకాలం నుంచి జరుగుతున్నదే. సీనియర్ హీరోల తనయులు .. దర్శక నిర్మాతల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు కీరవాణి ఫ్యామిలీ నుంచి హీరో వస్తుండటం విశేషంగానే చెప్పుకోవాలి. సంగీత దర్శకుడిగా కీరవాణికి గల పేరు ప్రతిష్ఠలను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు.

ఇప్పటికే కీరవాణి పెద్దబ్బాయి 'కాలభైరవ' సింగర్ గా తన ప్రత్యేకతను చాటుతున్నాడు. ఇక చిన్నబ్బాయి 'సింహ' మాత్రం హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ కుర్రాడిని హీరోగా పరిచయం చేయనున్నారు. ఈ సినిమా ద్వారా ఒక నూతన దర్శకుడు పరిచయం కానున్నాడని అంటున్నారు. తక్కువ బడ్జెట్ తోనే అయినా ఒక అసాధారణమైన థీమ్ తో ఈ కథ కొనసాగుతుందని చెబుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేయనున్నారు.   

More Telugu News