vijay: 80 దేశాల్లో .. 3000 స్క్రీన్లలో 'సర్కార్'

  • రాజకీయాల నేపథ్యంలో 'సర్కార్ '
  • ఎన్నారై పాత్రలో కనిపించనున్న విజయ్
  • తెలుగు రాష్ట్రాల్లో 750 థియేటర్స్ లో రిలీజ్    

తమిళనాట దర్శకుడిగా మురుగదాస్ కి .. మాస్ హీరోగా విజయ్ కి గల క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన 'సర్కార్' చిత్రం ఈ నెల 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 750 థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో 3000 స్క్రీన్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. విజయ్ కెరియర్లో ఈ స్థాయిలో విడుదల కావడం ఇదే మొదటిసారి అని అంటున్నారు.

వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని చెబుతున్నారు. ఈ సినిమాలో విజయ్ అమెరికా నుంచి వచ్చి తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించిన ఎన్నారై గా కనిపిస్తాడట. ప్రస్తుతం తమిళనాడు లోని రాజకీయపరమైన సమస్యలను ఈ సినిమాలో చూపిస్తారని తెలుస్తోంది. క్లైమాక్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనీ .. విజయ్ - మురుగదాస్ లకు హ్యాట్రిక్ హిట్ ఖాయమనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది .     

More Telugu News